రామాపురం గ్రామంలో 426మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
వివరాల్లోకి వెళితే నాలుగు రోజుల క్రితం మండలంలోని రామాపురం గ్రామంలో ఒక మహిళకు కరోనా నిర్ధారణ కావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమై రామాపురం గ్రామంలో మొత్తం 426మంది నుండి శాంపిల్స్ తీసుకుని పరిక్షల నిమిత్తం ల్యాబ్ కు తరలించగా….. మార్కాపురంలోని కోవిడ్ పునరావాస కేంద్రాలకు తరలించిన 18మంది నుండి కూడా శాంపిల్స్ తీసుకుని పరిక్షల నిమిత్తం ఒంగోలుకు తరలించారు.
మొత్తానికి మండలంలోని రామాపురం గ్రామంలో తీసుకున్న శాంపిల్స్ యొక్క కరోనా నిర్ధారణ పరీక్షల ఫలితాలు మరో నాలుగు లేక అయిదు రోజుల్లో వచ్చే అవకాశం ఉందని వైద్యశాఖ అధికారులు తెలిపారు.