ప్రత్యేక బస్సులో సొంత జిల్లాలకు ప్రజలను తరలింపు
జాతీయ లాక్ డౌన్ సమయంలో సొంత జిల్లాలకు వెళ్ళలేక పొదిలి నందు చిక్కుకున్న వివిధ జిల్లాల ప్రజలను వారి సొంత జిల్లాలకు ప్రత్యేక బస్సులో తరలించారు.
వివరాల్లోకి వెళితే స్థానిక మాదాల వారి పాలెంలోని పునరావాస కేంద్రం నుంచి పొదిలి ఆర్టీసీ డిపో చెందిన ప్రత్యేక బస్సులో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 7మందిని….. విజయనగరం జిల్లాకు చెందిన 4మందిని….. తూర్పుగోదావరి జిల్లా చెందిన ముగ్గురిని…. కృష్ణ జిల్లా చెందిన ఇద్దరిని వారి స్వస్థలాలకు ఆదివారంనాడు తరలించారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవిన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, యస్ఐ సురేష్, వైద్య అధికారిణి షేక్ షహిదా, ఆర్ఐ సుబ్బారాయుడు మరియు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.