నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన విజయబ్యాంకు సిబ్బంది
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు నిత్యావసర సరుకులను విజయబ్యాంకు( బ్యాంక్ ఆఫ్ బరోడా) సిబ్బంది బుధవారంనాడు అందజేశారు.
వివరాల్లోకి వెళితే స్థానిక దర్శి రోడ్డులోని శ్రీపతి నగర్ నందు నివసించే 40కుటుంబాలకు నిత్యావసర సరుకులను విజయబ్యాంకు (బ్యాంక్ ఆఫ్ బరోడా) పొదిలి శాఖ మేనేజర్ నాగమల్లేశ్వరరావు, అసిస్టెంట్ మేనేజర్ కళ్యాణ్ చక్రవర్తిలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో బ్యాంకు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.