ఇసుక మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలని కందుల డిమాండ్
అక్రమంగా ఇసుక నిల్వలు చేసి విక్రయాలకు పాల్పడుతున్న ఇసుక మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలని మార్కాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందుల నారాయణరెడ్డి డిమాండ్ చేశారు.
వివరాల్లోకి వెళితే మండలంలోని ఆముదాలపల్లి అన్నవరం గ్రామాల మధ్యలోని పొలాలలో ఇసుక అక్రమంగా నిల్వచేసి తరలింపుకు సిద్ధంగా ఉన్న ఇసుక స్టాక్ పాయింట్ ను సందర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ పొదిలి మండల వైసీపీ నాయకులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా ఇసుకను నిల్వచేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని……..
కోట్లాది రూపాయాలను తెచ్చిపెట్టే ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుని మండలంలో సుమారు 10కి పైగా స్టాక్ పాయింట్లను పెట్టుకుని అక్రమ రవాణాకు పాల్పడుతున్నారని మండిపడ్డారు….. వైసీపీ నాయకుల ఇసుక మాఫియాపై సీబీఐ విచారణ జరిపించాలని అధికారులను డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వెంకటేశ్వరరెడ్డి, పండు అనిల్, షేక్ గౌస్, నియోజకవర్గ మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.