వైకాపా నాయకులు స్కీం ల పేరుతో స్కామ్ లు చేస్తున్నారు : కందుల

వైకాపా నాయకులు స్కీం ల పేరుతో కోట్లాది రూపాయల స్కాం లను చేస్తున్నారని మార్కాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి ఆరోపించారు.

వివరాల్లోకి వెళితే బుధవారంనాడు పొదిలి పర్యటనలో భాగంగా స్ధానిక సామంతపూడి సామిల్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ పొదిలి పట్టణంలో పేదలకు నివేశన స్థలాల పంపిణీ పనులలో భూమి చదును పేరుతో వైసీపీ నాయకులు 4.5కోట్లు రూపాయలు కొల్లగొట్టారని అదే విధంగా మండలలోని పలు గ్రామాల్లో ఇదే విధంగా కోట్ల రూపాయల స్కాం లను చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు….. తక్షణమే ప్రభుత్వం జోక్యం చేసుకుని భూమి చదును పేరుతో దోచుకున్న కోట్లాది రూపాయల స్కాం పై విచారణ జరిపించాలని లేకపోతే ప్రత్యక్ష ఆందోళన తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు యర్రంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సయ్యద్ ఇమాంసా, భూమి సుబ్బారావు, సామంతపూడి నాగేశ్వరరావు, పండు అనీల్, షేక్ గౌస్, మండల పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.