వ్యవసాయ మార్కెట్ కు స్థలం కేటాయింపు – జిల్లా కలెక్టర్ పొలా

పొదిలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏర్పాటు నుంచి నేటి వరకు సుమారు 30సంవత్సరాల నుండి సొంత భవనం మరియు మార్కెట్ లేకపోవడంతో‌ పొదిలి ప్రాంత రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్యల్ని నివారించేందుకు నూతన పాలకవర్గ చైర్మన్ గుర్రపుశాల కోటేశ్వరి చొరవతో నూతన మార్కెట్ కమిటీ నిర్మాణం కల సాకారం కాబోతుంది.

వివరాల్లోకి వెళ్ళితే మండలంలోని ఒంగోలు- కర్నులు రాష్ట్ర రహదారి చింతగంపల్లి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 112లోని ఐదు ఎకరాల భూమిని జిల్లా కలెక్టర్ పొలా భాస్కర్ గురువారం నాడు పరిశీలించి వ్యవసాయ మార్కెట్ కమిటీ నిర్మాణానికి అనువుగా ఉంటుందని….. కాబట్టి భవన నిర్మాణం కొరకు కేటాయిస్తానని సంక్రాంతి నాటికి వ్యవసాయ మార్కెట్ రైతులకు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు కూడా కృషి చేయాలని ఆదేశాలు జారీచేశారు.

ఈ కార్యక్రమంలో కందుకూరు రెవెన్యూ డివిజన్ అధికారి ఓబులేసు, మండల రెవెన్యూ తహశీల్దారు ప్రభాకరరావు, వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గుజ్జుల రమణారెడ్డి మరియు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.