ఫార్మా ఉద్యోగుల సంక్షేమం కోసం పని చేస్తా: పులుకూరి వికాస్

ఫార్మాస్యూటికల్ కంపెనీలు మరియు ఫార్మాసిస్ట్ పనిచేసే ఉద్యోగుల సంక్షేమ కోసం పని చేస్తానని భారత ఫార్మాసిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ కో ఆర్డినేటర్ నూతనంగా ఎన్నికైన పులుకూరి వికాస్ అన్నారు.

వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణానికి చెందిన పులుకూరి వికాస్ భారత ఫార్మాసిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ శాఖ కో ఆర్డినేటర్ గా ఎంపికైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రాష్ట్రంలో ఉన్న ఫార్మా రంగంలో పని చేస్తున్న ఉద్యోగుల సంక్షేమం కోసం మరియు ఫార్మా విద్యాను అభ్యసిస్తున్న విద్యార్ధులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.