ఉపాధి హామీ పథకంలో మాయాజాలం

జాబ్ కార్డుకు 1000రూపాయలు

మస్టర్లు వేసినందుకు వారానికి 100రూపాయలు

కూలీ పనులకు రాకుండా మస్టర్లు వేస్తే
40-60

గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కోసం రూపొందించిన జాతీయ ఉపాధి హామీ పథకానికి తూట్లు పడుతున్నాయి.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ వేళ గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కోసం జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా పెద్ద ఎత్తున పనులు కల్పించి పేదలను ఆదుకోవాలని తలంపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వాలు కృషి చేస్తుంటే…… పొదిలి మండలంలో కొన్ని పంచాయతీలలో ఉపాధి హామీ పథకం సిబ్బంది మాయాజాలం సృష్టించి చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే పొదిలి టైమ్స్ ప్రతినిధి బృందం మండలంలో కరువు పనులు జరుగుతున్న తీరును పరిశీలించగా దిమ్మతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి.

పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలోని కాటూరివారి పాలెం గ్రామంలో కొంత మంది కూలీల ద్వారా సేకరించిన సమాచారం మేరకు కొత్తగా జాబ్ కార్డు కావాలంటే 1000రూపాయలు….. మస్టర్లు వేసినందుకు ఒక్కొక్కరికి దగ్గర వారానికి 100రూపాయలు….. కూలీ పనులకు రాకుండా మస్టర్లు వేస్తే 60శాతం ‌సిబ్బందికి 40శాతం కూలీలకు ఇచ్చే విధంగా ఒప్పంద చేసుకుంటున్నారని అదే విధంగా నచ్చిన వారికి ఒక రేటు నచ్చని వారికి ఒక రేటును కూలీలకు ఇస్తున్నారని ఉపాధి హామీ పథకం కూలీలు తమ గోడును వెల్లడించారు.

తక్షణమే అధికారులు పొదిలి గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఉపాధి హామీ పథకం కూలీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.