జూన్ 30వరకు దేశవ్యాప్తంగా ‌లాక్ డౌన్ 5.0

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఐదోసారి లాక్ డౌన్ కొనసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారంనాడు ఉత్తర్వులు జారీచేసింది.

వివరాల్లోకి వెళితే మే 31వ తేదీన లాక్ డౌన్ 4.0ముగిసే నేపథ్యంలో శనివారంనాడు లాక్ డౌన్ ను జూన్ 30 వరకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగిస్తూ ఆదేశాలు జారీచేస్తూ….. పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు కేవలం కంటోన్మెంట్ జోన్లోకే పరిమితం చేసింది.

అదే విధంగా రాత్రి 9గంటల నుండి ఉదయం 5వరకు దేశవ్యాప్తంగా కర్ఫ్యూ అమలులో ఉంటుందని…… జూన్ 8వ తేదీ నుంచి దేవాలయలు ,ప్రార్థన మందిరాలు హోటళ్ళు, రెస్టారెంట్లు, వసతిసేవలు, షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇచ్చింది.

జూన్ 8 నుంచి విద్యా సంస్థలు తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నిర్ణయాధికారం ఇచ్చింది.

* విద్యాసంస్థలు పునఃప్రారంభంపై జులైలో నిర్ణయం తీసుకుని….. విద్యాసంస్థల పునఃప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇస్తుంది.

అనుమతి ఇవ్వని వాటి వివరాలు :-

* మెట్రో రైలు సేవలకు అనుమతి లేదు.
* అంతర్జాతీయ విమాన సేవలకు అనుమతి లేదు.
* సినిమాహాల్స్‌, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.