వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ సురేష్

పట్టణంలోని స్థానిక పెద్ద బస్టాండ్ సెంటర్ నందు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా ఎస్ఐ సురేష్ వాహన తనిఖీలను నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే లాక్ డౌన్ నేపథ్యంలో పొదిలిలో కోవిడ్ కేసుల వ్యాప్తి నిరోధించే దిశగా అనవసరంగా బయట తిరుగుతున్న పలు వాహనాలను తనిఖీ చేసి హెల్మెట్ మరియు సరైన వాహన పత్రాలు లేకుండా సంచరిస్తున్న వాహన చోదకులకు పొదిలి ఎస్ఐ సురేష్ ఈ-చలానాను విధించారు.

ఈ సందర్భంగా ఆయన పొదిలి టైమ్స్ తో మాట్లాడుతూ కోవిడ్ వ్యాధి నిర్ములనకు ప్రజలు అధికారులతో సహకరించి అత్యవసరం అయితేనే బయటికి రావాలని….. బయటికి వచ్చేటప్పుడు కనీస జాగ్రత్తగా మాస్కును ధరించి సామాజిక దూరం పాటించాలని ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో పొదిలి పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.