అమర్‌నాథ్ యాత్రను రద్దుచేసిన ప్రభుత్వం….

అమర్‌నాథ్ యాత్రను రద్దుచేస్తూ జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం ప్రకటించింది.

వివరాల్లోకి వెళితే దాయాదిదేశ పాకిస్థాన్ అమర్‌నాథ్ అమర్‌నాథ్ యాత్రకు వచ్చే భక్తులపై దాడికి తెగబడే యోచనలో ఉందని….. దానికి సంబంధించి పాకిస్థాన్ లో తయారైన ల్యాండ్ మైన్లు, రైఫీళ్ళు గుర్తించడం జరిగిందని అమర్‌నాథ్ యాత్రికులను టార్గెట్ చేసుకుని ముష్కరకాండకు దిగే అవకాశం ఉండడంతో అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తున్నామని జమ్మూ & కాశ్మీర్ ప్రభుత్వం తెలిపింది.

ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల హెచ్చరికల దృష్ట్యా అమర్‌నాథ్ యాత్రికులు తమ యాత్రను రద్దుచేసుకోవడమే కాకుండా వెళ్లినవారు వెనక్కి రావాలని, ప్రశాంత కశ్మీర్ లో అలజడులు సృష్టించడమే లక్ష్యంగా పాక్ ఏర్పాటు చేసిన మందుపాతరలు, ఆయుధ సామగ్రిని గుర్తించామని లెఫ్టినెంట్ జనరల్ కేజెఎస్ థిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

కాగా జమ్మూ&కాశ్మీర్ లో సుమారుగా లక్షలాదిగా భద్రతాబలగాలు శాంతిభద్రతల కోసం పోరాడుతుండగా…. ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఆదేశాలతో మరో 35వేల మంది అదనపు బలగాలను పంపించడం…. ఇదంతా జమ్మూకాశ్మీర్ పై భారత ప్రభుత్వం పూర్తిస్థాయిలో పట్టుసాధించేందుకు ప్రధాని నరేంద్రమోడీ చేస్తున్న ప్రయత్నం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.