కాశ్మీర్ లో ఏం జరుగుతోంది ?… అదనంగా 35వేలమంది సైన్యం మోహరింపు ఎందుకు ?… కేంద్రం తీసుకునే కీలకమైన నిర్ణయం ఏమిటి?

కాశ్మీర్ లో ఏమి జరగబోతుంది ?… రాబోయే కొన్ని గంటల్లో కేంద్రం తీసుకునే కీలకమైన నిర్ణయం ఏమిటి ?… కాశ్మీర్ కు అదనంగా 35వేలమంది సైన్యం మోహరించడం సంకేతం ?… అసలు కాశ్మీర్ లో జరగబోయేది ఏమిటనే అంశంపై దేశం మొత్తం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశంలో
జమ్మూ & కాశ్మీర్ కు ఆర్టికల్ 35ఏ ద్వారా స్వయంప్రతిపత్తి కలిగిఉన్న ప్రత్యేక హక్కులను రద్దుచేసి అక్కడ భారత రాజ్యాంగం అమలుచేసే యోచనలో కేంద్రం ఉందా?… లేక మరో ఏదైన కారణం ఉందా?… అలా కాకపోతే గత వారంలో 10వేల మంది మన సైన్యాన్ని పంపించి మరలా ఇప్పుడు అదనంగా 25వేలమంది సైనికులను అక్కడ మోహరించేందుకు పంపడం ఎందుకు?…. అనే ఉత్కంఠకు దారితీసిన ఈ ప్రశ్నలకు మరికొద్ది గంటలలోనే సమాధానం దొరకనుంది.