దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించిన ఇంటెలిజెన్స్…

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల పోలీసు హెడ్ క్వార్టర్లకు భారత ఇంటెలిజెన్స్ బ్యూరో రెడ్ అలర్ట్ జారీ చేశాయి.

వివరాల్లోకి వెళితే పాక్ నిఘాసంస్థకు చెందిన ఐఎస్‌ఐ ఏజెంట్లు భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని….. ఇప్పటికే ఐఎస్ఐ ప్రేరేపిత స్లీపర్ సెల్స్ దేశంలోకి చొరబడ్డారని భారత ఇంటెలిజెన్స్ నిఘావర్గం హెచ్చరికలు జారీ చేసింది.

అయితే దేశంలోని ప్రధాన నగరాలలో విధ్వంసం సృష్టించేదిశగా ఐఎస్‌ఐ కుట్ర చేసిందని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘా వర్గాలను, సైన్యాన్ని, పోలీసులను హెచ్చరించింది.

ముఖ్యంగా ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలలో పోలీసులు, సైన్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ…. అనుమానిత వ్యక్తులను కొత్తగా తమ ప్రాంతాల్లో సంచరిస్తున్న వ్యక్తులను గురించిన సమాచారాన్ని పోలీసులకు ఇవ్వాలని ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రజలకు సూచించింది. ఇప్పటికే నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడ్డారని సమాచారం ఉందని… రాజస్థాన్, గుజరాత్ మీదుగా వీరు దేశంలోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు తెలిపాయి.