కుట్రపూరితంగా నమ్మించి మోసం చేసిన కేసులో నాలుగురిపై కేసు నమోదు

పొదిలి మండలం నంది పాలెం గ్రామానికి చెందిన కనుబుద్ది రమణారెడ్డి తండ్రి నారాయణ అను నతను పొదిలి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పొదిలి గ్రామానికి చెందిన (1) వందవాసి వెంకట రమేష్ (2) కొవ్వురి శ్రీనివాసులు  (3) వందవాసి వెంకట సుబ్రహ్మణ్యం (4) వందవాసి వెంకట సత్యవతి అను వారంద రు కలిసి కుట్రపన్ని ఫిర్యాది ని

మోసం చెయ్యాలనే ఉద్దేశ్యం తో వారికి చెందిన విశ్వనాథ పురం లో వున్న D.No 9-431గల ఇంటి ని ఇతర కుటుంబ సభ్యుల ను ఒప్పించి రిజిస్ట్రేషన్ చేయిస్తామని నమ్మించి (5600000/-) యాభై ఆరు లక్షల రూపాయలు అమ్మేందుకు గాను ఒప్పందం కుదుర్చుకుని 12,00,000/- అడ్వాన్స్ గా తీసుకుని ఒప్పందం ప్రకారం ఇంటిని రిజిస్ట్రేషన్ చేయలేదని మధ్య వర్తి గా వ్యవహరించి ఒప్పందం కుదిర్చి న కొవ్వురి శ్రీనివాసులు తండ్రి సుబ్బయ్య 200,000/- తీసుకొని కూడా మిగతా వారితో కలసి ఫిర్యాదును మోసం చేశారని ఇలా ఎందుకు తనను మోసం చేశారని అడిగితే A2 ముద్దాయి బెదిరించారని , ముద్దాయిలకు అమ్మడానికి పూర్తి అధికారం లేదని తెలిసి కూడా A2 ముద్దాయి తో కలసి కుట్రపన్ని మోసం చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారందరి పై కేసు నమోదు చేసినట్లు యస్ఐ శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు