నరేంద్ర హత్య కేసులో ముద్దాయిలు అరెస్టు – ఎస్పీ ఎఆర్ దామోదర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ముద్దాయిలను స్వల్ప వ్యవధిలో అరెస్టు చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
మర్డర్ కేసును ఛేదించుటలో ప్రతిభ చూపిన పోలీసు సిబ్బందిని అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్
కేసు నెంబర్:152/2024 U/s 62, 331(4), 103, 238 r/w 190 BNS
పిర్యాది:చల్లా వెంకటేశ్వర్లు S/o చిన్న నరసింహం(63 సం)కులం: యాదవ, Rtd RTC కండక్టర్, PNR కాలనీ 3వ లేన్, పొదిలి టౌన్
ముద్దాయిలు:1.బొమ్మినేని @ చల్లా లక్ష్మి ప్రియ D/o బొమ్మినేని ఏడుకొండలు & W/o చల్లా వెంకట నరేంద్ర బాబు, వయస్సు 26 సంవత్సరాలు, యాదవ కులం, PNR కాలనీ, 3వ లేన్, పొదిలి టౌన్,
2.కొండా శశికుమార్, S/o నరసింహారావు, వయస్సు 24 సంవత్సరాలు, కూలం: SC మాల R/o PNR కాలనీ, 3వ లైన్, పొదిలి టౌన్.
3.షేక్ నహీద్, S/o నజీర్, వయస్సు 20 సం, కులం:ముస్లిం, నేతాజీ నగర్, వెంకటేశ్వర పురం, నెల్లూరు టౌన్.
4.షేక్ ఫజ్లు, S/o షాహుల్, వయస్సు 19 సం, కులం:ముస్లిం,నేతాజీ నగర్, వెంకటేశ్వర పురం, నెల్లూరు టౌన్.
5.సయ్యద్ సిద్దిక్, S/o జాకీర్, వయస్సు 22 సం, కులం:ముస్లిం, జనార్దన్ రెడ్డి కాలనీ, వెంకటేశ్వరపురం, నెల్లూరు టౌన్.
6. షేక్ ముబారక్, S/o ఇస్మాయిల్, వయస్సు 19 సం, కులం:ముస్లిం మన్సూర్ నగర్, నెల్లూరు టౌన్.
మృతుడు: చల్లా వెంకట నరేంద్రబాబు S/o వెంకటేశ్వర్లు, 40 సంవత్సరాలు, కులం:యాదవ, కేంద్ర ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్‌లో ఇన్‌స్పెక్టర్, ఒంగోలు, R/o PNR కాలనీ 3వ లేన్, పొదిలి టౌన్
అరెస్ట్: The accused A2 to A6 were arrested on 09.08.2024 at Katurivaripalem village outskirts and A1 was arrested on 10.08.2024 at her residence in Podili town.
Motive of the offence:To continue illegal relationship of the accused A1 & A2.
Date of Offence :On intervening night of 02/03.08.2024 in between 01.00 hrs and 02.00 hrs, Date of Report:On 03.08.2024 at 10.15 hrs
నేరము చేసిన తీరు మరియు అందుకు గల కారణాలు:A2 ముద్దాయి సుమారు ఒక సం. క్రితము తన కుటుంబము తో పాటు మృతుడు ఇంటికి ఎదురుగా వున్న ఇంటిని అద్దెకు తీసుకొని వుంటునట్లు, ఈ క్రమములో 8 నెలల క్రితము మృతుడి కుమారుడు ఆడుకొంటూ ఇంటి ముందు వున్నా డ్రైనేజ్ కాలువలో ప్రమాదవశాత్తు పడిపోగా, అది చూసిన ముద్దాయి కొండ శశికుమార్ ఆ అబ్బాయిని డ్రైనేజీ కాలువ నుండి బయటకు తీసినాడు. ఆ రోజు నుండి ముద్దాయి కొండ శశికుమార్ తో మృతుడి భార్య చల్లా లక్ష్మి ప్రియ కి పరిచయము ఏర్పడి ఇద్దరు ఫోన్ లో మాట్లాడు కొంటు సాన్నిహిత్యం ఏర్పచుకొని మృతుడు ఇంటిలో లేని సమయములో ముద్దాయి కొండ శశికుమార్ మృతుడి ఇంటిలోనికి వెళుతూ మృతుని భార్య లక్ష్మి ప్రియతో శారీరకంగా కలుస్తూ వున్నారు. తరువాత కొద్ది రోజులకు లక్ష్మీ ప్రియ ప్రవర్తనలో మార్పు రావడం గమనించిన మృతుడు వారి ఇద్దరి మధ్య ఉన్న అక్రమ సంబంధాన్ని నిర్ధారించుకుని, లక్ష్మీప్రియ మరియు శశికుమార్ లను మందలించి. లక్ష్మీప్రియ కు ఫోన్ ఇవ్వకుండా దూరము పెట్టినాడు. అందువలన వారిఇద్దరికి మాట్లాడుకోవతము ఇబ్బందిగా వుండి శశికుమార్ లక్ష్మి ప్రియకు ఎవరికీ తెలియకుండా లక్ష్మి ప్రియకు మరొక కొత్త keypad ఫోన్ ఇచ్చి, ఇద్దరు ఫోన్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ, వారి సంభాదని కొనసాగిస్తూ వుండగా మృతుడు తన భార్య ను గట్టిగా మందలిస్తూ వున్నాడు. అది భరించలేని లక్ష్మి ప్రియా మరియు శశికుమార్ లు మృతుడిని ఎలాగైనా చంపి వారి అక్రమ సంభందానికి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని లక్ష్మి ప్రియ ఇంటి లో బంగారు నగలను శశికుమార్ కు ఇచ్చి వాటిని తాకట్టు పెట్టి వచ్చిన డబ్బులతో మనుషులను ఏర్పాటు చేసి వారి ద్వారా మృతుడిని చంపించాలని పథకం వేసినారు. అందులో భాగముగా తేది 02.08.2024 న శశికుమార్ నెల్లూరు వెళ్లి నలుగురు వ్యక్తులను (A3 to A6) రూ.2,00,000/- కిరాయి కి మాట్లాడుకొని వారిని అదే రోజు రాత్రి పొదిలి కి తీసుకొని వచ్చి అర్ధరాత్రి మృతుడు నిద్రపోయిన తరువాత వారందరూ మృతుడి ఇంటిలోనికి వెళ్లి నిద్రపోతున్న మృతుని గొంతుకి తాడు బిగించి గట్టిగా లాగి ఉపిరి ఆడకుండా చేసి హత్యచేసి దానిని ఆత్మహత్య గా చూపించాలని వారందరూ కలిసి మృతుడిని వంటగదిలో తాడుతో వేలదాదీసినారు.
అంతట ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏఆర్ దామోదర్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పొదిలి CI మల్లికార్జున మరియు పొదిలి ఎస్సై కోటయ్య నేతృత్వంలో ప్రత్యేక టీమును నియమించి నేరం జరిగిన తీరుని బట్టి త్వరితగతిన దర్యాప్తుకు జారీ చేసిన మార్గదర్శకాలు, సలహాలు అనుసరిస్తూ అన్ని కోణాలలో దర్యాప్తు చేసి, మర్డర్ కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది.
అభినందన: ఈ కేసును స్వల్ప వ్యవధిలోనే ఛేదించడంలో ప్రతిభ కనపరచిన పొదిలి సిఐ మల్లికార్జున, పొదిలి ఎస్సై జి.కోటయ్య మరియు సిబ్బంది లను ప్రకాశం జిల్లా ఎస్పీ గారు అభినందించి ప్రశంసపత్రాలను(GSE) అందచేశారు.