సీజనల్ వ్యాధులు ప్రబలకుండా మున్సిపల్ అధికారులు చర్యలు
వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పొదిలి నగర పంచాయితీ కమిషనర్ డానియల్ జోసప్ ఆదేశాల మేరకే శానిటరీ ఇన్స్పెక్టర్ మారుతిరావు పర్యవేక్షణలో పొదిలి పట్టణంలోని అన్ని వార్డుల్లో ఎబెట్ దోమల మందు ను పిచికారి చేసారు.
మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖల సంయుక్తంగా పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సూపర్వైజర్ నారు శ్రీనివాస్ మరియు వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.