అక్రమ నిర్మాణాన్ని అడ్డుకున్న పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది

ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలను పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల సిబ్బంది సంయుక్తంగా అడ్డుకున్నారు.

వివరాల్లోకి వెళితే స్థానిక పెద్ద చెరువుకు చెందిన పొదిలి సర్వే నెంబర్ 164నందు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారనే సమాచారం అందుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆక్రమణదారులపై ఫిర్యాదు చేశారు.

యస్ఐ సురేష్ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణం చేపట్టిన స్ధలానికి చేరుకుని నిర్మాణాలను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ మాట్లాడుతూ విచారణ జరిపి ఆక్రమణ దారులపై కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.