అమ్మవారి ఆస్తుల అన్యాక్రాంతం…. కోట్లాది రూపాయల అమ్మవారి ఆస్తులకు ఎసరుపెట్టిన భూ భకాసురులు

పట్టణం మరియు పరిసర ప్రాంతాలలో భూ భకాసురుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది.

నిన్న మొన్నటి వరకు చెరువులు, కుంటలు, వాగులు, పోరంబోకు స్థలాలు, స్మశానాలు వంటివి అక్రమించుకుంటూ వచ్చిన భూకబ్జాదారులు ఇప్పుడు ఏకంగా ఆ జగన్మాత అంకాల పరమేశ్వరి దేవి ఆస్తికే ఎసరు పెట్టిన కబ్జాదారులు….. దేవాదాయశాఖ మరియు రెవిన్యూ అధికారులు సహాయంతో రాజకీయ నాయకులు అండదండలతో అడ్డదారిలో పొందిన పాసుపుస్తకాలతో యజమానులుగా చలామణి అవుతూ…. నూతనంగా నిర్మిస్తున్న రైల్వే లైనులో పోయిన మా ఆస్తులకు నష్టపరిహారం చెల్లించాలంటూ అంకాల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన భూముల సర్వే నంబర్లపై అర్జీలు వచ్చినట్లు తెలుసుకున్న పొదిలి టైమ్స్ బృందం……

ఈ విషయంపై జరిపిన అంతర్జాల పరిశోధనలో అమ్మవారి ఆస్తులు కబ్జాకోరల్లో చిక్కుకున్నట్లు గుర్తించి….

పొదిలి గ్రామ సర్వే నంబరు 1174నందు గల 15ఎకరాల 24సెంట్లు భూమికి సంబంధించి అక్రమంగా పాసుపుస్తకాలను పొందినట్లు సమాచారహక్కు చట్టం ద్వారా పొదిలి టైమ్స్ సేకరించిన ఎఫ్ఎంబి, ఎఫ్ఎల్ఆర్, ఇనాం-బి రిజిస్టర్, తదితర రెవిన్యూ, దేవాదాయ శాఖలకు సంబంధించిన రికార్డుల ద్వారా స్పష్టం అవుతోంది. ప్రస్తుతం సదరు ఆక్రమిత అమ్మవారి దేవస్థాన భూమి విలువ బహిరంగ మార్కెట్ ధర ప్రకారం సుమారు 5కోట్లు పైమాటే….

రికార్డులకు విరుద్ధంగా అక్రమార్కులకు అండగా పాసుపుస్తకాలు తయారు చేసేందుకు అలాగే దేవాదాయశాఖ జోక్యం చేసుకోకుండా ఉండేందుకు రాజకీయ నాయకులు ఒత్తిడి తెచ్చినట్లు అలాగే భారీగా తాయిలాలు కూడా చేతులు మారినట్లు తెలుస్తోంది….. కాగా అధికారులు చర్యలు తీసుకుని ఇప్పటికైనా అంకాల పరమేశ్వరి అమ్మవారి భూములను తిరిగి అమ్మవారి దేవస్థానానికి చెందేలా చేయకపోతే రోడ్లపైకి రాక తప్పదని భక్తులు హెచ్చరిస్తున్నారు.