పంట సాగు హక్కు పత్రాల పై అవగాహన సదస్సులు

పొదిలి మండలం లోని అన్ని రైతు భరోసా కేంద్రాలలో పంట సాగు హక్కు పత్రాల పై రైతులకు గ్రామ సభలు ద్వారా అవగాహన కల్పించడం జరుగుతుందని పొదిలి మండల వ్యవసాయ శాఖ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
గ్రామ సభల వివరాలు

06.04.2022 కొండాయపాలెం
07.04.2022 మాదాలవారిపాలెం
08.04.2022కంభాలపాడు
11.04.2022 మల్లవరం
12.04.2022 కుంచేపల్లి
13.04.2022 పాములపాడు
18.04.2022 సూదనగుంట
19.04.2022 ఆముదాలపల్లి
20.04.2022తలమళ్ల
21.04.2022 ఉప్పలపాడు
22.04.2022 ఏలూరు
23.04.2022 పొదిలి-1
25.04.2022 పొదిలి-2
26.04.2022 పొదిలి-3
27.04.2022 పొదిలి-4
28.04.2022 పొదిలి-5
29.04.2022 పొదిలి-6

కావున పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం రైతు భరోసా కేంద్రం పరిధిలోని పొలం యజమాని నుండి కౌలుకు తీసుకొని ఖరీఫ్ 2022 లో సాగు చేయదలిచిన కౌలు రైతులు అందరూ గ్రామ సభకు హాజరైన ఆ పొలం కి సంబంధించిన 1బి నకలు మరియు ఆధార్ వివరాలు గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి నమోదు చేయించుకోగలరని తెలిపారు.

ఈ పంట సాగు హక్కు పత్రం పొందడం వలన ప్రభుత్వం అందించే రాయితీలు అయిన, విత్తనాలు, ఈ పంట నమోదు, పంటల బీమా,పంట కొనుగోలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు పంట నష్టపరిహారం కౌలు రైతుకు అందజేయటనికి ఈ పంట సాగు హక్కు పత్రం కౌలు రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు.

కావున ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఒక ప్రకటన లో తెలిపారు.