బలమైన బిసి ఉద్యమ సంస్థ ఏర్పాటు అవసరం : ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలమైన బిసి ఉద్యమ సంస్థ ఏర్పాటు అవసరం ఎంతో ఉందని ఆంధ్రప్రదేశ్ యాదవ కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు.

వివరాల్లోకి వెళితే శనివారం స్థానిక అఖిల భారత యాదవ మహాసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బిసిలకు దామాషా ప్రకారం దక్కవలసిన రాజకీయ వాటా దక్కకుండా బిసిలకు మొండిచేయి చూపుతున్నారని బిసిలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది తనతో సంప్రదించి బిసి ఉద్యమ నిర్మాణం చేపట్టాలని కోరారని త్వరలోనే 13 జిల్లాలోని బిసి కుల సంఘ నాయకులతో సంప్రదింపులు జరిపి ఉద్యమ సంస్థ పేరు, విధి విధానాలు మరియు ఎజెండా రూపకల్పన చేసే దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టామని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఇటీవల గుంటూరు జిల్లాలో
అత్తాకోడళ్లను ట్రాక్టరుతో ఢీకొట్టి హత్యచేసిన సంఘటన అదేవిధంగా చిత్తూరులో శ్రీకృష్ణుడు గర్భగుడికి అడ్డుగోడ నిర్మించడం వంటి సంఘటనలు……. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బిసిలపై దాడులు చేయడం నిర్బంధించడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా బిసిలపై జరుగుతున్న దాడులపై చర్యలు తీసుకోకపోతే బలమైన ఉద్యమం చేయవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా నాయకులు పొల్లా నరసింహ యాదవ్, మూరబోయిన బాబూరావు యాదవ్, మువ్వ కాటంరాజు, బిసి నాయకులు బత్తుల వెంకటేష్ యాదవ్, చాతరాజుపల్లి చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.