భారత్ బంద్ జయప్రదం చేయాలని ద్విచక్ర వాహనాల ర్యాలీ

కేంద్ర ప్రభుత్వ రైతు ,ఉధ్యోగ ,కార్మిక ,ప్రజా వ్యతిరేక విదానాలకు నిరసనగా మార్చి 26 భారత్ బంద్ జయప్రదంచేయాలని కోరుతూ ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే శుక్రవారం నాడు సిఐటియు ,యుటియఫ్ ఆధ్వర్యంలో స్థానిక యంపిడిఓ కార్యాలయం వద్ద నుంచి ఆర్టీసీ బస్టాండ్, పెద్ద బస్టాండ్, చిన్న బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మోడి ప్రభుత్వం వ్యవసాయాన్నుంచి రైతులను దూరంచేసి కార్పోరేట్లకు అప్పగించేందుకు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకురావటం దారుణమన్నారు.
విశాఖ ఉక్కు ప్రవేటీకరణతో పాటు ప్రభుత్వరంగ సంస్థలను ప్రవేట్ పరంచేయడం మోడీ ప్రభుత్వం మానుకోకుంటే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

ఈ ర్యాలీలో సిఐటియు పశ్చిమ ప్రకాశంజిల్లాప్రదాన కార్యదర్శి యం రమేష్ ,యుటియఫ్ జిల్లాకార్యదర్శి షేక్ అబ్దుల్ హై ,జిల్లాఆడిట్ కమిటి సభ్యులు బి బుజ్జిబాబు ,పొదిలి మండల అధ్యక్షకార్యదర్శులు డి బాలకాశిరెడ్డి ,యం నాగార్జునరావు ,కొనకనమిట్ల మండల అధ్యక్షులు ఆర్ చంద్రమౌళి ,జియంపియస్ పశ్చిమప్రకాశంజిల్లా కార్యదర్శి టి తిరుపతిరావు ,సిఐటియు పొదిలి మండల నాయకులు ఆర్ శ్రీనివాసులు , ఎ వెంకట్రావు ,జి నాగులు, డి సుబ్బయ్య ,కె వి నరసింహాం , బి కోటేశ్వరావులు తదితరులు పాల్గొన్నారు