భవిత విద్యార్థులకు మెరుగైన ఫిజియోథెరఫి సేవలు అందించాలి

పొదిలి మండల భవిత కేంద్రంలోని ఫిజియోథెరపీ శిబిరాన్ని జిల్లా సమగ్ర శిక్ష అభియాన్ సమన్వయకర్త సుధా మాధురి మరియు సహాయ సమన్వయకర్త ఆర్ జగన్నాధ రావు ఆకస్మిక తనిఖీ చేశారు.

వివరాల్లోకి వెళితే భవిత కేంద్రంలో జరుగుతున్న ఫిజియోథెరఫి శిబిరంలో విద్యార్థులకు అందిస్తున్న సేవల గురించి పిల్లలతో, తల్లిదండ్రులతో చర్చించారు. అనంతరం బుద్ధిమాంద్యం గల పిల్లలకు వినికిడి సమస్య, మాటలు రాని పిల్లలకు ఇస్తున్న సేవలు గురించి…. తరగతిగది నిర్వహణ వంటి వివిధ రకాల కృత్యాలను పరిశీలించి పాఠశాల నిర్వహణ రికార్డులను పరిశీలించారు.

అలాగే ఇంకా ఎక్కువమంది పిల్లలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. భవిత పాఠశాలకు దాతల సహకారం మరువలేనిదని…. అలాగే పిల్లలకు మెరుగైన శిక్షణను అందించుటకు దాతల సహకారంతో నీటి సమస్య మరియు వివిధ పరికరాలను సమకూర్చాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఐ ఈ డి ఉపాధ్యాయులు గోపాలకృష్ణ, షాహిదా బేగం, డాక్టర్ డి ప్రవీణ్ కుమార్, కేర్ గివార్ నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.