ముఖ్యమంత్రి గారు… మా మీద దయ చూపండి సార్….
నిన్నటి కరోనా మహమ్మరిలో ఫ్లెక్స్ రంగం చాలా దెబ్బతిని మా జీవితాలు నడవలేక చతికిలపడిందని ఇప్పుడు ఫ్లెక్సీలు నిషేధ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉపసంహరించుకోని మా పట్ల దయ చూపించాలని పొదిలి మున్ స్టార్ ప్లెక్సీ ప్రింటింగ్ యాజమాని షేక్ మహమ్మద్ రఫీ తెలిపారు.
చాలి చాలని ముడి సరుకులు/మెటీరియల్ చైనా నుండి దిగుమతి లేక ఎక్కువ రేటుతో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బడా పెట్టుబడిదారులు మాకు అమ్ముతూ మా ఫ్లెక్స్ ప్రింటింగ్ వ్యాపారం సరిగా జరగక మా కష్టార్జితాన్ని సగం మెటీరియల్ పంపిణీ దారులు దోచుకుంటూ, ఒక ప్రక్క కరెంట్ బిల్లులు & హై ఓల్టేజ్ సమస్యలతో, మా మిషన్ రిపేర్లతో సతమతమవుతూ దిక్కు తోచక, నిద్ర లేని రాత్రులు గడుపుతూ, తిండి తిని తినక మా ఆరోగ్యాలు కోల్పోతూ నిశ్చయ స్థితిలో మేమంటే… ఒక్క సారిగా నిషేధం విధిస్తూ తిసుకున్నా నిర్ణయాన్ని పునర్ పరిశీలించాలని వారు కోరారు.
నిన్నటి 13 జిల్లాలలో సరాసరి ఒక జిల్లాలో 160 యూనిట్స్ వుంటాయి. అంటే 13X160=2080 ఫ్లెక్స్ యూనిట్స్ వుంటాయిని ఒక్కొక్క యూనిట్ లో 10 మంది వర్కర్స్ మరియు ఫ్లెక్స్ కట్టే లేబర్ వర్కర్స్ ఒక యూనిట్ కు 10 మంది అలా రాష్ట్ర మొత్తం లో సుమారు 50 వేల మంది ఉన్నారని అదే విధంగా అనుబంధంగా వున్న వెల్డర్స్, కార్పెంటర్ లు , ముడి సరుకులు అమ్మేవారు … ఇలా ఎంతో మంది జీవనోపాధి కోల్పోయే ప్రమాదంలో పడ్డారని అన్నారు.
సగంలోనే ఆగిన మా బ్యాంక్ లొన్ లు/ అప్పులు, అర్ధాంతరంగా ముగుస్తున్న మా జీవితాల పట్ల దాయ చూపించాలని లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యమని అన్నారు.
ఈ సమావేశంలో షేక్ నాయబ్ రసూల్ (ఖాల్ నాయక్) రంగా తదితరులు పాల్గొన్నారు