నాణ్యత,తూకల్లో తేడా ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందండి

 

నాణ్యత లేని వస్తువులు తూకం తేడా ఉంటే ఫిర్యాదు చేస్తే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని వినియోగదారుల రక్షణ సమితి అధ్యక్షులు దర్నాసి రామారావు అన్నారు.

వివరాల్లోకి వెళితే సోమవారం నాడు స్థానిక మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు ప్రపంచ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వినియోగదారుల రక్షణ సమితి అధ్యక్షులు దర్నాసి రామారావు అధ్యక్షతనతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కిరాణా,ఫ్యాన్సీ, క్లాత్, కారు , ద్విచక్ర వాహనాలు ఏదైనా కొనుగోల్లో కష్టనష్టాలు ఎదురైనా మరియు కల్తీలు పై ఫిర్యాదు చేసి నష్టపరిహారం పొందవచ్చని తమ సంస్థ తాత్కాలిక కార్యాలయం ఎన్జీవో కాలనీ మసీదులో ఉందని అన్నారు.

అనంతరం తహశీల్దార్ హనుమంతరావు ను ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో వినియోగదారుల రక్షణ సమితి నాయకులు జి బి షా సీనియర్ సభ్యులు మజూన్స, హుసేన్ పాచా, ప్రసంగించారు. లోక్ అదాలత్ సభ్యులు భూమా రాంబాబు, పరా లీగల్ వాలంటీర్ ఉదయ లక్ష్మి,  బి అపర్ణ, ఎసార్ పాచా, జే బి కంప్యూటర్స్ ప్రిన్సిపాల్ జిలానీ, బాల శ్రీను, మద్దాలి కేశవరావు, అర్ ఐ, వీఆర్వో లు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు