పశుమేత భూమిని ఆక్రమించిన‌ వారి పై చర్యలు తీసుకోవాలని తహశీల్దారు కు ఫిర్యాదు

పశుమేత భూమిని ఆక్రమించిన‌ వారి పై చర్యలు తీసుకోవాలని నడికట్టు సుబ్బారెడ్డి పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు కు మంగళవారం నాడు వినతి పత్రాన్ని అందజేశారు.

వివరాల్లోకి వెళితే నిమ్మరం గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 78 ఎం నందు గల పశుమేత భూమిని కొంతమంది ఆక్రమణయత్నం పై స్పందించిన రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం సిబ్బంది సదరు భూమి నందు హెచ్చరిక బోర్డు ను ఏర్పాటు చేశారు

మంగళవారం నాడు స్థానిక పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు తహశీల్దారు హనుమంతరావు కు వినతి పత్రం
అందించగా స్పందించిన తహశీల్దారు హనుమంతరావు తక్షణమే ఆక్రమించేందుకు యత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు.