రేపటి నుండి సంపూర్ణ లాక్ డౌన్

రేపటి నుండి పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు తెలిపారు.వివరాల్లోకి వెళితే గురువారంనాడు ఒక్కసారిగా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించిన 25మందిలో 11మందికి పాజిటివ్ రావడం….. పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని పట్టణంలో సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తహశీల్దార్ ప్రభాకరరావు పొదిలి టైమ్స్ కు తెలిపారు.


ప్రజలు అనవసరంగా బయట తిరగకుండా స్వచ్ఛందంగా లాక్ డౌన్ పాటిస్తూ అధికారులకు సహకరించాలని….. ఉదయం 9గంటలలోగా కావలసిన నిత్యావసర సరుకులను తీసుకుని వెళ్లి ఇళ్లలోనే ఉంటూ జాగ్రత్తగా ఉండాలని…… అలాగే వ్యాపారస్తులు మాస్కులు లేని వారికి విక్రయాలు నిలిపివేయాలని దుకాణం వద్ద రద్దీ ఎక్కువగా ఉంటే టోకెన్ విధానంలో విక్రయాలు నిర్వహించాలని….. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని జాగ్రత్త చర్యలు తీసుకోని యెడల అటువంటి దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.

మెడికల్ షాపులు మినహా అన్ని ప్రైవేటు వ్యాపార వాణిజ్య సంస్థలు, సేవలు 9గంటల తరువాత నిలిపివేయాలని….. అత్యవసర సేవల కోసం మాత్రమే ప్రజలు బయటికి రావాలని తదుపరి ఆదేశాల వచ్చే వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండాలనే సంకల్పంతో విధిస్తున్న లాక్ డౌన్ కు ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.