కరోనాతో మరణించిన వారి అంత్యక్రియలు అడ్డుకుంటే శిక్షార్హులు : న్యాయమూర్తి యస్ బార్గవి

కరోనా వైరస్ బారినపడి మృతి చెందినవారి అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని జూనియర్ సివిల్ జడ్జి మరియు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎస్ భార్గవి గురువారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21ప్రకారం వ్యక్తి మరణాంతరం అంత్యక్రియలకు సంబంధించిన హక్కులు ఉంటాయని తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని 147,148,297, 341లను అనుసరించి కరోనాతో చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలు అడ్డుకోవడం చట్టరీత్యా నేరమని….. అంత్యక్రియలను అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేసి శిక్ష అమలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.

ప్రతి వ్యక్తి చట్టప్రకారం వ్యవహరించాలని అంత్యక్రియలను అడ్డుకోరాదని ప్రజలకు సూచించారు.