పెద్ద చెరువు చిన్న చెరువు ఆక్రమణలను తొలగించండి – సిపిఐ కార్యదర్శి కెవి రత్నం

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

పెద్ద చెరువు చిన్న చెరువు ఆక్రమణలను తొలగించండి – సిపిఐ కార్యదర్శి కెవి రత్నం

గత మూడు రోజులుగా పొదిలి పట్టణం నందు ట్రాఫిక్ కు అడ్డుగా ఉన్నాయని మున్సిపల్ అధికారులు రోడ్డు ప్రక్కన చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకుంటున్న నిరుపేదల యొక్క షాపులు నేలమట్టం చేసిన విధంగానే పొదిలి పెద్ద చెరువు భూములు, పొదిలి చిన్న చెరువు భూములు, చెరువు యొక్క వాగులు, కాలువలు భూ కబ్జాలు చేసి, ప్లాట్లుగా వేసి ఇండ్ల నిర్మాణాలు జరిపి వారి ఇష్టానుసారంగా అమ్మి సొమ్ము చేసుకున్న భూ కబ్జాదారులపై సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పొదిలి మండల భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి కెవి రత్నం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

పొదిలి చిన్న చెరువు అలుగు వాగు నుండి దర్శి రోడ్డులో గల తోళ్ళమడుగు వాగు వరకు అధికారులు సర్వే నిర్వహించి కోట్ల రూపాయల భూములు కబ్జాలు చేసిన భూకబ్జాదారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అదే విధంగా పొదిలి పెద్ద చెరువుకు సంబంధించి చెరువు విస్తీర్ణం 700 ఎకరాల పైచిలుకు ఈ 700 ఎకరాలలో,100 ఎకరాలకు పైగా చెరువు కబ్జాలకు భూకంక్షాదారులు కబ్జాకు పాల్పడి అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు.

పెద్ద చెరువు అలుగు భూములు కాలువల భూములు యథేచ్ఛగా ఎటువంటి భయం లేకుండా నిర్మాణాలు చేపట్టారు.

రేపటి రోజున ఏదైనా అతివృష్టి వచ్చి చెరువులలోకి నీరు వస్తే, ఆ నీరు ఎటు పోవాలి, నీరు పోవటానికి, అలుగులు ఆక్రమించారు, చెరువు కాలువలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు అప్పుడు ఆ నీరు పొదిలి పట్టణం నందు ఊరి మీద పడుతుంది. ఊరు మునుగుతుంది ఈ భూకబ్జాదారుల ధనదాహానికి ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరుగుతుంది. మొన్న విజయవాడ నగరాన్ని అందరం చూశాం కదా ఇటువంటి పరిస్థితులు వాటిల్లకుండా ఉండాలంటే ఈ భూకబ్జాదారులు ఆక్రమించి నిర్వహించిన భవనాలను, కట్టడాలను హైదరాబాద్ లో కూల్చివేసిన ( హైడ్రా ) తరహాలో కూల్చివేసి, చెరువుల భూములను ప్రభుత్వం వారు స్వాధీన పరుచుకోవాలి అన్నారు

అదేవిధంగా పొదిలి మండల రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులు సమన్వయంతో కలిసి పని చేసి ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు