ప్రయాణీకుల పట్ల ఆటో డ్రైవర్లు గౌరవంగా వ్యవహరించాలి : డియస్పీ నాగరాజు

ప్రయాణీకుల పట్ల ఆటో డ్రైవర్లు గౌరవంగా వ్యవహరించాలని దరిశి డియస్పీ నాగరాజు అన్నారు.

స్ధానిక పొదిలి పోలీస్ స్టేషన్ నందు ఆటో డ్రైవర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో ముఖ్య అతిధిగా హాజరైన డియస్పీ నాగరాజు మాట్లాడుతూ పరిమితికి మించి అధిక లోడ్ తో ఆటోలు నడపడం ప్రమాదాలకు కారణం అవుతుందని….. కాబట్టి పరిమితి మించి ప్రయాణీకులను ఆటోలో ఎక్కించుకుని ఆటోలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని….. అదేవిధంగా కొంతమంది ఆటో డ్రైవర్లు మహిళల పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారని అటువంటి వారి పట్ల పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా జైలుకు పంపించడం జరుగుతుందని అన్నారు. కాబట్టి ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు.

లైసెన్సు లేకుండా ఆటోలు నడిపితే ఆటో డ్రైవరుతో పాటుగా ఓనర్ పై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని….. ఆటో డ్రైవర్లు మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా సరైన రీతిలో వాహనాలు నడపాలని ఆయన సూచించారు.

పొదిలి యస్ఐ శ్రీరామ్ మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా…. మద్యం సేవించి ఆటోలు నడపకూడదని…. ఆటో డ్రైవర్ ప్రక్కన ఎవరిని కూర్చోపెట్టుకుని డ్రైవింగ్ చెయ్యకూడదని…… ప్రభుత్వ పథకాలను తెలుసుకుని వాటిని సద్వినియోగం చేసుకుని…. ఆటోలో డ్రైవర్ ఫోటో మరియు ఓనర్ ఫోటోతో పాటుగా మొబైల్ నెంబరుతో కూడిన పోలీస్ వారి ధ్రువీకరణ బోర్డ్ ప్రయాణికులకు కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని….. డ్రైవర్లు ఖచ్చితంగా నిబంధనల ప్రకారం డ్రైవింగ్ చేయాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, మరియు ఆటో డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.