తెలుగు కాలంధర ను ఆవిష్కరణ

త్రైత సిద్ధాంత తెలుగు యుగాది కాలంధర(త్రైత శకం-44)ను పొదిలి‌ నగర పంచాయితీ అధికారి డానియల్ జోసప్ శుక్రవారం నాడు లాంఛనంగా ఆవిష్కరించారు.

పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రభుత్వేతర సంస్థల్లో కాలంధరను పంపిణీ చేశారు.

సృష్టి ఆది నే యుగాది అంటారని, యుగాది కి గుర్తు గా ఆదివారం ఉందని, పండుగ లలో మొదటిది అని, సృష్టి ఆవిర్భావం జరిగిన రోజు అని, కావున ప్రతి ఒక్కరూ యుగాది రోజు భక్తి శ్రద్ధలతో దేవుడిని కొలిచేవారని తర్వాత ఆరు గుణాల గుర్తుగా షడ్రుచుల ప్రసాదం ను తయారు చేసి యుగాది ప్రసాదం గా పెట్టి తీసుకునేవారని, కాలక్రమంలో యుగాది ప్రసాదం అనేది ఉగాది పచ్చడి గా మారిందని సంస్థ అధ్యక్షులు రమణయ్య అన్నారు.

ఈ కార్యక్రమంలో త్రైత సిద్ధాంతం- ప్రబోధ సేవా సమితి పొదిలి కమిటీ అధ్యక్షుడు యు వి రమణయ్య , శేఖర్, వెంకట రెడ్డి, శ్రీరామన్, సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.