ఆక్రమణదారులకు అసైన్మెంట్ పట్టాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్

పొదిలి రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం నందు మంగళవారం నాడు తహశీల్దారు దేవ ప్రసాద్ అధ్యక్షతన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పొదిలి గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 1177 లో 164 ఎకరాల ప్రభుత్వ తోపు భూమిని ఆక్రమించుకుని సాగు ఉన్న వారితో రెవెన్యూ తహశీల్దారు కార్యాలయం సిబ్బంది పలుమార్లు చర్చలు జరిపి జగనన్న ఇంటి నివేశన స్థలాలకు 40 శాతం భూమి ఇచ్చేందుకు ఒప్పించి మీగత 60 శాతం భూమిని ఆక్రమించుకుని సాగు ఉన్న వారికి అసైన్మెంట్ పట్టాలను ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు.
ఒప్పందం చేసుకున్నా ప్రకారం 59 మంది ఆక్రమణదారులకు జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా పట్టాలను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, జాయింట్ కలెక్టర్ మురళి, సబ్ కలెక్టర్ అపరంజత్ సింగ్ తదితరులు ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, జాయింట్ కలెక్టర్ మురళి కృష్ణ, సబ్ కలెక్టర్ అపరంజత్ సింగ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.