మద్యం టోకెన్లు పంపిణీ చేసిన ఎక్సైజ్ శాఖ అధికారులు
మద్యం అమ్మకాలు సంబంధించిన టోకెన్లను ఎక్సైజ్ శాఖ అధికారులు పంపిణీ చేశారు.
వివరాల్లోకి వెళితే మద్యం అమ్మకాలకు సంబంధించిన టోకెన్ల పంపిణీ కార్యక్రమాన్ని గురువారంనాడు మద్యం దుకాణాల వద్ద ఎక్సైజ్ శాఖ అధికారి దుర్గాప్రసాద్ లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుక్రవారం, శనివారం మద్యం అమ్మకాలకు సంబంధించిన టోకెన్లను మద్యం దుకాణాల వద్ద పంపిణీ చేస్తున్నామని…… ఒక్కో షాపు నందు గంటకు 50మందికి చొప్పున మొత్తం అన్ని దూకణాల పరిధిలో టోకెన్లు పంపిణీ చేస్తున్నామని…… మద్యం విక్రయాలు సమయంలో కొనుగోలుదారుడు ఖచ్చితంగా మాస్కు ధరించి, గొడుగు పట్టుకుని ఆధార్ కార్డుతో వచ్చిన వారికే మద్యం విక్రయాలు జరుపుతారని ఈ సందర్భంగా ఆయన పొదిలి టైమ్స్ కు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పొదిలి ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు మరియు ఎక్సైజ్ శాఖ సిబ్బంది మరియు సేల్స్ సూపర్వైజర్లు, సేల్స్ మెన్ లు తదితరులు పాల్గొన్నారు.