జన్మభూమి రుణం తీర్చుకున్న ప్రవాస భారతీయులు

 

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

పొదిలమ్మ దేవస్థానం ప్రహారీ మరియు ముఖద్వారానికి వేద మంత్రోచ్ఛారణ మధ్య సోమవారం నాడు శంఖుస్థాపన చేశారు .

స్థానిక పొదిలి పట్టణం చెందిన దాసరి అనంత సుబ్బారావు జ్ఞాపకార్థం కుమార్తె ప్రవాస భారతీయులు అనిత కుమారి పృదులాపురి మాత పొదిలమ్మ తల్లి దేవస్థానం ప్రహారీ , ముఖద్వారం, వంట గది నిర్మాణం పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్నారు.

దేవస్థానం ప్రహారీ ముఖద్వారం మరియు వంట గది నిర్మాణం కోసం సుమారు 30 లక్షల రూపాయలు అంచనా తో నిర్మించేందుకు ప్రవాస భారతీయులు అనిత కుమారి తన భర్త సుంకర రవిబాబు ను ఒప్పించి సోమవారం నాడు మంగళ వాయిద్యాలు వేద పండితులు మంత్రోచ్ఛారణ మధ్య శంఖుస్థాపన కు శ్రీకారం చుట్టారు.

ప్రవాసంలో ఉన్న జన్మభూమి పైన ఉన్న మమకారంతో సొంత గ్రామం లో తన తండ్రి జ్ఞాపకార్థం తన సొంత నిధులు సుమారు 30 లక్షల రూపాయలు అంచనా తో ప్రహారీ ముఖద్వారం వంట గది నిర్మాణం శ్రీకారం చుట్టడం పట్ల పొదిలి టైమ్స్ తో పాటు పట్టణం కు చెందిన పలువురు ప్రముఖులు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సుంకర అనిత కుమారి లాగా ప్రవాసంలో ఉన్న భారతీయులు జన్మభూమి రుణం తీర్చుకునేందుకు పాటుపడతారని ఆశిద్దాం

ఈ కార్యక్రమంలో పొదిలి దేవాదాయ శాఖ జూనియర్ అసిస్టెంట్ కాటూరి ప్రసాద్, అమర్ తదితరులు పాల్గొన్నారు