కొత్త పాస్ బుక్ వచ్చిన రైతులు పేర్లు నమోదు చేసుకొవాలి

కొత్తగా పాస్ బుక్ వచ్చిన రైతులు రైతుభరోసా కేంద్రం నందు పేరు నమోదు చేయించుకోవాలని దర్శి వ్యవసాయ సహాయ సంచాలకులు కె అర్జున్ నాయక్ అన్నారు.

శుక్రవారం నాడు స్థానిక పొదిలి -3 రైతు భరోసా కేంద్రం నందు మండల వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు అధ్యక్షతన తో మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం‌ నిర్వహించారు.

ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసులు మాట్లాడుతూ 2022-23 ఖరీఫ్ మరియు రబీ పంట కాలానికి అనుగుణంగా విత్తనాలు ఎరువులు పురుగుమందులు సబ్సిడీ పై సకాలంలో రైతులకు అందజేస్తామని
కంది పంట ఏకపంటగా అనేక సంవత్సరాల నుంచి సాగు చేయడంతో అనేక రకాల చీడ పీడలు వలన పంట నష్టం కలిగిస్తున్నాయని కావున ఈ సంవత్సరం నుంచి చిరుధాన్యాలు పంట లు సాగు చేసుకోవాలని సూచించారు.

.
దర్శి వ్యవసాయ సహాయ సంచాలకులు , కె.అర్జున్ నాయక్ గారు మాట్లాడుతూ ఖరీఫ్ 2022 సంవత్సరం కు గాను కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గ్రామ వ్యవసాయ సహాయకులు లేదా గ్రామ రెవెన్యూ అధికారి గారిని సంప్రదించి కౌలు రైతు కార్డులను పొందాలని అన్నారు.

రైతులు అందరూ వేసిన పంటలను తప్పని సరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని అన్నారు.

మండల ఉద్యానవన అధికారి సంధ్య మాట్లాడుతూ ఉద్యానవన శాఖలో ఉన్నటువంటి పథకాలు గురించి మరియు ఉద్యానవన రైతులకి రాబోయే ఖరీఫ్ 2022 కు గానూ కావాల్సిన విత్తనాలు ఎరువులు సకాలంలో అందజేస్తామని తెలిపారు.

మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పేరం చెంచిరెడ్డి మాట్లాడుతూ ఉద్యానవన మరియు వ్యవసాయ శాఖలో ఉన్నటువంటి పథకాలు ను రైతులు అందరూ సద్వినియోగం చేసుకోగలరని కోరారు

జాతీయ హామీ పథకం కింద చవుడు భూములలో చెరువు మట్టి కానీ వేసుకున్నట్లు అయితే సాగు కి అనుకూలంగా ఉంటుందని ఎపిఓ బుల్లెనరావు అన్నారు.

ఈ కార్యక్రమంలో పొదిలి మండల‌ వ్యవసాయ శాఖ సలహా మండలి సభ్యులు మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు