పేకాట శిబిరంపై పోలీసుల దాడి నాలుగురు అరెస్టు

పొదిలి మండలం రామాపురం గ్రామ శివారులో కోత ముక్క ఆడుతున్న నాలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1250 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పొదిలి యస్ఐ శ్రీహరి ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

రాబడిన సమాచారం మేరకు రామాపురం గ్రామంలో కోత ముక్క శిబిరం పై తన సిబ్బందితో దాడి చెయ్యగా నాలుగురిని అదుపు లోకి తీసుకోగా మరో కొంత మంది తప్పించుకొని పారిపోవడం జరిగిందని వారి అందరి పై కేసు నమోదు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నమని యస్ఐ శ్రీహరి తెలిపారు