ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ 114వ జయంతి వేడుకలు పొదిలి లో ఘనంగా నిర్వహించారు.

మంగళవారం నాడు స్థానిక మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్థానిక ఎబియం కళాశాల వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పలువురు దళిత బహుజన నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

స్థానిక బెల్లంకొండ విద్యా సంస్థలో బాబు జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పలువురు బాబు జగ్జీవన్ రామ్ సేవలను కొనియాడారు.