అక్రమ లే ఔట్ లో ప్రభుత్వం భూమి ఉందని నిర్ధారించిన అధికారులు
పొదిలి నగర పంచాయితీ పరిధిలోని మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద అక్రమ లే ఔట్ నందు ప్రభుత్వం భూమి ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.
వివరాల్లోకి వెళితే మంగళవారం నాడు స్థానిక మార్కాపురం క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా వేసిన లే ఔట్ ను తొలగించిన నగర పంచాయితీ సిబ్బంది బుధవారం నాడు నగర పంచాయితీ, రెవెన్యూ, పోలీసు సిబ్బంది సంయుక్తంగా సందర్శించి సర్వే నిర్వహించి అనంతరం అందులో ప్రభుత్వం భూమి 3.50 ఎకరాల ఉన్నట్లు గుర్తించినట్లు పొదిలి నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ మీడియాకు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదిలి నగర పంచాయితీ పరిధిలో ప్లాట్లు కొనుగోలు చేసే తప్పుడు సదరు లే ఔట్లు కు అనుమతులు ఉన్నాయి లేవా అనే విషయం ప్రజలు నగర పంచాయతీ కార్యాలయం నందు సంప్రదించి తెలుసుకోవాలని తెలిపారు.
అక్రమ లే ఔట్లు ల్లో ప్లాట్లు కొనుగోలు చేస్తే వాటికీ నగర పంచాయతీ ప్లాన్ మంజూరు చేయదని అట్టి వాటికి బ్యాంకు రుణాలు మంజూరు కూడా చెయ్యలేదని కాబట్టి నగర పంచాయితీ ప్రజలు అర్థం చేసుకొని అవగాహన తో కొనుగోలు చెయ్యాలని కమీషనర్ భవాని ప్రసాద్ కోరారు.
ఈ సంయుక్త తనిఖీ లో పొదిలి మండల రెవెన్యూ తహశీల్దారు హనుమంతరావు, యస్ఐ సురేష్, మరియు రెవిన్యూ సిబ్బంది, నగర పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు