గ్రామ వాలంటీర్ల ఎంపిక ఇంటర్వ్యూలు ప్రారంభించిన తహశీల్దార్, ఈఓఆర్డీ

పొదిలి మండలంలో గ్రామ వాలంటీర్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు ఇంటర్వ్యూలను ప్రారంభించారు.

వివరాల్లోకి వెళితే మండలంలోని అక్కచెరువు, ఓబులక్కపల్లి, పాములపాడు, నందిపాలెం, ఆముదాలపల్లి గ్రామ పంచాయతీలకు సంబంధించిన గ్రామ వాలంటీర్ల పోస్టులుకు సంబంధించి తొలిరోజు ఇంటర్వ్యూలను ఒక విభాగానికి మండల రెవిన్యూ తహశీల్దార్ ప్రభాకరరావు మరియు వ్యవసాయశాఖ అధికారి శ్రీనువాసులరెడ్డి…… మరో విభాగానికి పంచాయతీరాజ్ విస్తరణ అధికారి రాజశేఖర్, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ పి హనుమంతరావు, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్ శ్రీనివాసులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అయితే తొలి రోజు ఇంటర్వ్యూకు 60మందికి సమాచారం అందించగా 46మంది హాజరయ్యారు.