ప్రజలను విశేషంగా ఆకట్టుకున్న జనవిజ్ఞాన వేదిక ఇంద్రజాల ప్రదర్శనా కార్యక్రమం

స్థానిక జూనియర్ కాలేజి గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన జనవిజ్ఞాన వేదిక ఇంద్రజాల ప్రదర్శన ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక చిన్నబస్టాండ్ నుండి జూనియర్ కాలేజి వరకు జనవిజ్ఞాన వేదిక బైకు ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన ఇంద్రజాల ప్రదర్శనా కార్యక్రమంలో మేజిషియన్ బివి రామన్ మరియు పరశురామ్ లు వినూత్న రీతిలో చేసిన మేజిక్ షోలు పిల్లలను, పెద్దలను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్టు జడ్జి ఎస్ సి రాఘవేంద్ర, పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ ముఖ్యఅతిథిలుగా హాజరై వారు మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశనుండే విజ్ఞానం పెంపొందించుకోవాలని సైన్స్ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని…. పర్యావరణాన్ని సంరక్షించే విధంగా చెట్లను పెంచే బాధ్యత తీసుకోవాలని….. ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించి పాలిథిన్ వాడేలా అవగాహన తీసుకురావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు రమేష్, ఉపాధ్యక్షులు రామారావు, జిల్లా అధ్యక్షులు ఖాజా హుస్సేన్, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పొదిలి డివిజన్ అధ్యక్షులు గురుస్వామి, కన్వీనర్ చంద్రశేఖర్ మరియు సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.