కోర్టు పరిధిలోని భూమి కబ్జా

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు సీసీఎల్ఏ పరిధిలో ఉన్న స్మశాన భూమిని కబ్జా చేసేందుకు యత్నించిన సంఘటన శనివారంనాడు చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే పొదిలి గ్రామ రెవిన్యూ సర్వే నంబరు 853/2లోని స్మశానం భూమిలో అక్రమంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపడుతున్నారని ఆరోపిస్తూ 2010లో పెరియార్ ఫౌండేషన్ అధ్యక్షులు మందగిరి వెంకటేష్ యాదవ్ ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తకు ఫిర్యాదు చేయగా 2012లో సదరు స్మశాన భూమిలోని ఆక్రమణలను తొలగించాలని లోకాయుక్త ఉత్తర్వులు జారీచేసింది.

లోకాయుక్త ఉత్తర్వులపై హైకోర్టుకు వెళ్లి స్టే తీసుకుని వచ్చిన తదుపరి సీసీఎల్ఏ కు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం ఆ భూమి వివాదంపై సీసీఎల్ఏ నందు విచారణ జరుగుతుండగానే శనివారంనాడు కొంతమంది వైసీపీ నాయకులు వారి అనుచరులతో జేసిబి, ట్రాక్టర్లతో చదును చేస్తుండగా అడ్డుకున్న విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు, జనసేన నాయకులను ఘర్షణకుదిగి అక్కడినుండి బయటకు నెట్టివేయడంతో వెంటనే ఆ ఘటనపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు.

అయితే సదరు స్థలంలో అయ్యప్పస్వామి అన్నదాన సత్రం ఏర్పాటు చేయాలని తలంపుతో మాత్రమే చదును చేస్తున్నామని అంతకుమించి మేము ఎటువంటి కబ్జాకు పాల్పడలేదని వైసీపీ నాయకులు అంటున్నారు.