హెచ్.ఐ.వి. సుఖ వ్యాధుల పై అవగాహన ర్యాలీ
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
హెచ్ఐవి సుఖ వ్యాధులు వాటి రుగ్మతల వలన వచ్చే నష్టాలను తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ పట్టణంలోని వివిధ విద్యా సంస్థల్లో గురువారం అవగాహన సదస్సులు ర్యాలీ నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు ఈ అవగాహన సదస్సును నిర్వహించినట్లు సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రాజెక్టు మేనేజర్ కోటేశ్వరరావు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శ్రావణి వెంకటేశ్వర్లు, ధర్మారావు,వైద్య సిబ్బంది ఏయన్ఎం కుమారి, ఒఆర్ డబ్ల్యులు రమణయ్య,లింగయ్య, శిరీష,నాగవేణి,ఐసిటిసి కౌన్సిలర్ హనుమంతరావు, ల్యాబ్ టెక్నీషియన్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు