వెంకన్న ఆలయంలో హుండీలు చోరీ

వెంకన్న ఆలయంలో హుండీలు చోరీ

పొదిలి పట్టణంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం నందు హుండీలు చోరీ అయినా సంఘటన గురువారం నాడు వెలుగులోకి వచ్చింది.

ఆలయం తలుపు తాళం పగులకొట్టి రెండు హుండీలను దొంగతనం చేసినట్టు దేవస్థానం కమిటీ పొదిలి పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న పొదిలి పోలీసులు క్లూస్ టీం ను రంగంలోకి దించి వేలిముద్రలను సేకరించారు.

సదరు చోరీకి గురైన రెండు హుండీలు పొదిలి మండలం సలకనుతల పొలంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేలిముద్రలను సేకరించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.