పాఠశాలలను సందర్శించిన ఐఏఎస్ డాక్టర్ ఆరిజ్ అహమ్మద్

స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల.. అలాగే స్థానిక విశ్వనాథపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హార్టికల్చర్ బోర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐఏఎస్ డాక్టర్ ఆరిజ్ అహమ్మద్ సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి విద్యార్థులు భావితరాలకు ఆదర్శంగా నిలిచేవిధంగా విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని…. గతంలో చదువులు చదవాలంటే ఎంతో కష్టంగా ఉండేదని…. నేటితరం విద్యార్థులకు చదువు అత్యంత చేరువలో ఉందని అన్నారు.

ఒక్క విద్యార్థి పక్కదోవ పట్టినాకూడా పూర్తి వ్యవస్థ నాశనం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థి క్రమశిక్షణ, దేశభక్తి కలిగివుండి తల్లిదండ్రులకే కాకుండా దేశకీర్తిని ప్రపంచానికి చాటిచెప్పే విధంగా తయారవ్వాలని ఆకాంక్షించారు.

అనంతరం మొక్కలునాటి ప్రకృతికి అందానిచ్చేవిగా వర్ణిస్తూ… జీవుల మనుగడ సాధించాలంటే భూమిపై మొక్కల యొక్క ఆవశ్యకతను వివరించారు.

ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ సభ్యులు అఖిబ్ అహమ్మద్, ముల్లా జిలానిబాషా, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.