రక్షిత మంచినీటి సరఫరా నందు మోటార్లును ప్రారంభించిన : కుందూరు
రక్షిత మంచినీటి సరఫరా కేంద్ర నందు నూతనంగా ఏర్పాటు చేసిన రెండు మోటార్లను మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి ప్రారంభించారు.
వివరాల్లోకి వెళితే పొదిలి పట్టణంలోని స్థానిక శివాలయం ఎదురుగా ఉన్న రక్షిత మంచినీటి సరఫరా కేంద్ర నందు
ప్రజా అవసరాల దృష్ట్యా అదనంగా మరో రెండు మోటార్లను ఏర్పాటు చేసే ప్రక్రియ లో భాగంగా సోమవారం నాడు ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం నియోజకవర్గం శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి, మరియు నగర పంచాయితీ కమీషనర్ భవాని ప్రసాద్ లు మోటార్ల స్విచ్ ఆన్ చేసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో గ్రామీణ నీటి సరఫరా (ప్రాజెక్టు) అధికారులు, వివిధ శాఖల అధికారులు ,వైకాపా నాయకులు జి శ్రీనివాసులు, కల్లం వెంకట సుబ్బారెడ్డి, గొలమరి చెన్నారెడ్డి, పట్టణ అధ్యక్షులు షేక్ రబ్బానీ తదితరులు పాల్గొన్నారు