చెకుముకి సంబరాల కరపత్రం ఆవిష్కరణ

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

 

అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్న చెకుముకి సంబరాలకు సంబంధించిన కరపత్రన్ని ఆవిష్కరించారు.

వివరాల్లోకి వెళితే బుధవారం నాడు స్థానిక పొదిలి సిఐటియు ఆఫీసు నందు ఏర్పాటు చేసిన సమావేశంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ఉపాధ్యక్షులు దాసరి గురుస్వామి ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ ప్రైవేటు కేజీబీవీ మోడల్ స్కూల్స్ లోని 8,9,10 తరగతిలో విద్యార్థులు పాల్గొనేలా అందరూ ప్రధానోపాధ్యాయులు అకడమిక్ క్యాలెండర్ కు ఇబ్బందు లేకుండా చెకుముకి ప్రతిభా పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు మేరకు ప్రధానోపాధ్యాయులు సహకరించి ఈ సంబరాలలో పాల్గొని కోరారు.

,ఈ కార్యక్రమం నాలుగు దశలలో జరుగుతుందని పాఠశాల స్థాయిలో అక్టోబర్ 28,మండల స్థాయిలో నవంబర్ 18,జిల్లా స్థాయిలో డిసెంబర్ 10 11 తేదీలలో రాష్ట్రస్థాయిలో 2023 జనవరి 7 8 తేదీలలో జరుగుతాయని దాసరి గురుస్వామి తెలిపారు.

ఈ కార్యక్రమంలో పొదిలి డివిజన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి చంద్రశేఖర్ బూదాల దేవప్రసాద్ కోశాధికారి ఆంజనేయ చౌదరి, కార్యదర్శి ఎంవి శ్రీనివాసరావు, కొనకనమిట్ల మండల అధ్యక్షులు ఐజాక్, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు