జబర్దస్త్ రాకింగ్ రాకేష్ టీమ్ నెమలి రాజుతో పొదిలి టైమ్స్ ప్రతినిధి ముఖాముఖి….

ప్రకాశంజిల్లా పొదిలి మండలం జువ్వలేరు గ్రామానికి చెందిన మూరబోయిన చిన్న రంగయ్య, చిన్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం…..రమణమ్మ, రంగా, నెమలి రాజు.

నెమలి రాజు పొదిలిలోని శ్రీ సాయి హైస్కూల్ నందు తొమ్మిదవ తరగతి విద్యాబ్యాసం చేస్తుండగా వర్షాలుపడక పంటలు పండకపోవడంతో ఊరిలో పనులు కూడా దొరకని పరిస్థితిలో కుటుంబం ఆర్ధిక ఇబ్బందులకు గురై విజయవాడకు వలస వెళ్లి….. అక్కడ తన తల్లి తండ్రులు కూలీ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నప్పటికి కుటుంబ ఆర్ధిక పరిస్థితి మెరుగుపడకపోవడంతో నెమలి రాజు చదువు మానేసి ఏదో ఒక పనిచేస్తూ తల్లిదండ్రులు చేదోడుగా ఉండాలనే ఆలోచన వచ్చిందని…… అనుకున్నదే పనిగా ఏదోఒక పని చేయాలని ఆలోచిస్తున్న రాజుకు ఎన్నో ఉపాధి ప్రయత్నాలలో విఫలం చెందినా కూడా తన ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రయత్నిస్తూనే ఉండగా అనుకోకుండా రామోజీఫిల్మ్ సిటీలో జబర్దస్త్ ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలుసుకుని తన సోదరుడు రంగాతో బయల్దేరి రామోజీ ఫిలింసిటీకి చేరుకోగా ఇక్కడ అవకాశం కష్టమని తెలుసుకుని అక్కడ ఒకరి సలహామేరకు ఢీ జోడి ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో రామానాయుడు స్టూడియోకి వెళ్లి ఎలాగైనా ఒక చిన్న ఛాన్స్ దొరకదా అనే ఆశతో ఆడిషన్స్ చూస్తున్న సమయంలో… స్క్రిప్ట్ రైటర్ రాజ్ కుమార్ అనుకోకుండా కలవడం ఛాన్స్ కోసం వచ్చానని ఆయనను అడగడంతో ఆయన జబర్దస్త్ రాకింగ్ రాకేష్ టీమ్ లో చేర్పించారని….. జబర్దస్త్ ప్రోగ్రాం ద్వారా బుల్లితెరపై ప్రజలకు పరిచయం అవ్వడానికి ముఖ్యుడు రాజ్ కుమార్ అని తెలిపారు.

జబర్దస్త్ రాకింగ్ రాకేష్ టీమ్ లో చేస్తుండగా స్క్రిప్ట్ రైటర్ రాజ్ కుమార్ ప్రోత్సాహం అందించి పటాస్ లో కూడా ఛాన్స్ ఇప్పించడం జరిగిందని అన్నారు. ఇప్పుడిప్పుడే సినిమా, సీరియల్ అవకాశాలు వస్తున్నాయని తెలిపారు.

పాఠశాలలో చదువుతున్న సమయంలో చిన్న చిన్న నాటకాలు, హాస్య కథా నాటికలు వేసే వాడిని అని….. అవి యూట్యూబ్ లో పెట్టడం వలన 2013లోనే జబర్దస్త్ లో అవకాశం ఇస్తామని ఫోన్ చేసి అడిగారని….. కానీ నేను చిన్న వయసులో ఉండడం పల్లెటూరు వాతావరణంలో పెరగడం వలన అమ్మానాన్నలు భయంతో నన్ను పంపించే ధైర్యం చేయలేకపోవడంతో అప్పుడు అవకాశం చేజారిందని….. ఆర్ధిక పరిస్థితులు, ఏదైనా చేయాలనే పట్టుదలతో అమ్మానాన్నకు నేను ఎలాగైనా ఒక అవకాశం దక్కుతుంది అని చెప్పి హైదరాబాదుకు బయల్దేరడం అక్కడ రాజ్ కుమార్ పరిచయం అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.

నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అవకాశం కోసం వెళ్తున్నప్పుడు ప్రోత్సహించిన ఆశీర్వదించిన నా తల్లిదండ్రులు, అవకాశం కల్పించిన స్క్రిప్ట్ రైటర్ రాజ్ కుమార్, రాకింగ్ రాకేష్, డైరెక్టర్ భరత్, పటాస్ శ్రీపాదం కు కృతజ్ఞతలు తెలిపారు. ఆదరిస్తున్న ప్రజలకు, ప్రోత్సహించిన ఉపాధ్యాయులు, మిత్రులకి, ధన్యవాదాలు తెలుపుతూ తన మనసులోని భావాలను పొదిలి టైమ్స్ తో పంచుకున్నారు.