ఘనంగా బాబు ‌జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు

మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్‌ రామ్‌ 114వ జయంతి ఉత్సవాలను సోమవారం జిల్లా పట్టణంలో ఘనంగా నిర్వహించారు.

వివరాల్లోకి వెళితే ‌స్థానిక ఎబియం స్కూల్ వద్ద ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి తో దళిత బహుజనుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

అనంతరం పొదిలి ప్రభుత్వ వైద్యశాల నందు రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

పలు పార్టీలు, సంఘాలు జయంతి వేడుకల్లో పాల్గొని బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాలు వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జీవితమంతా సమసమాజ స్థాపన కోసం కృషిచేసిన మానవతావాది బాబూజీ అని కొనియాడారు. గాంధీజీ ఆయన్ను బాబు జగ్జీవన్ రామ్ అమూల్య రత్నగా పిలిచారని సామాజిక వివక్ష, అసమానతలు లేని ప్రజాస్వామ్య సమాజ నిర్మాణం కోసం ఆయన కృషి చేశారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకొని బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పోరాడదామని పిలుపునిచ్చారు.

భారత స్వరాజ్య ఉద్యమంలోనూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా జగ్జీవన్ రామ్‌ భారత దేశ నిర్మాణంలోస్ఫూర్తి వంతమైన సేవలు అందించారని అన్నారు

ఈ కార్యక్రమంలోదళిత బహుజనుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి జాన్ బెన్ని, జిల్లా కార్యదర్శి కిన్నెర ప్రేమానందం, మార్కాపురం నియోజకవర్గం కార్యదర్శి కరాటపు అశోక్ కుమార్, మండల కార్యదర్శి వేల్పుల దాసు,బూదాల జాన్ ప్రకాష్, గౌడిపేరు దాసు, బాపిస్ట్ పాలెం సురేష్, వైసీపీ నాయకులు జి. శ్రీను, గూడూరి వినోద్, జిలాని, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ సైదా, యం. బి. సి జిల్లా అధ్యక్షులు చెట్లూరి బాదుల్ల,టీడీపీ నాయకులు ముల్లా ఖుద్ధుస్, షేక్ యాసిన్, డా. ఇమాంసా, పులుకూరి అనిల్, గొట్లగట్టు సర్పంచ్ పెరిక సుఖ్ దేవ్, రేగడపల్లి సర్పంచ్ బూదాల కమలాకర్,రోటి బ్రదర్ ఎస్దాన్, బాషా, ఏబియం స్కూల్ కరస్పాండెంట్ యం. దేవానంద్ కుమార్, రిటైర్డ్ యం. ఆర్. ఓ గంగవరపు వసంత కుమార్,డి ఎల్ పి ఓ. గుంటగాని నాగేశ్వరావు, గురజాల రాజేశ్వరరావు,యం. యోబు,గుంటగాని జాషువా బూదాల కన్నా,ఎస్సి సెల్ నాయకులు యర్రగుంట్ల నాగేశ్వరావు, సాల్మన్,టి. ఆఫీరస్, బండి అశోక్ తదితరులు పాల్గొన్నారు.