జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్ట్

జనవిజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ స్థాయిలో విద్యార్థులకు చెకుముకి టాలెంట్ టెస్టులో పాల్గొన్న విద్యార్థులందరూ బంగారు పతకాలను సొంతం చేసుకున్నారు.

వివరాల్లోకి వెళితే స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నందు జనవిజ్ఞాన వేదిక పొదిలి డివిజన్ అధ్యక్షులు దాసరి గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి డివిజన్ స్థాయి టాలెంట్ టెస్టులో పొదిలి, కొనకనమిట్ల, మర్రిపూడి, దర్శి, దొనకొండ మండలాల 35 పాఠశాలల నుండి 49టీములుగా 150మంది విద్యార్థులతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ విజయం సాధించి జనవిజ్ఞాన వేదిక నాయకురాలు దాసరి లక్ష్మీ చేతులమీదుగా బంగారు పతకాలను అందుకుని ముఖ్యఅతిథిలచే సత్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన పొదిలి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ పిల్లలు విద్యార్థి దశనుండే శాస్త్రీయ దృక్పథంతో ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

మండల విద్యాధికారి రఘురామయ్య మాట్లాడుతూ పిల్లలకు సైన్స్ పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిఉండేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.

దాసరి గురుస్వామి మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినవారు కనిగిరిలో డిసెంబర్ 1న జరగబోయే జిల్లాస్థాయి పరీక్షకు హాజరు కావాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, విజయ బ్యాంకు మేనేజర్ నాగ మల్లేశ్వరరావు, జన విజ్ఞాన వేదిక నాయకులు ప్రసాద్, తోట శ్రీనివాసులు మరియు మురళి, ఉమజ్యోతి, అరుణశ్రీ, దనిష, నాగలక్ష్మి, బ్రహ్మయ్య, రమణయ్య, ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.