కల్తీమద్యం విక్రయాలపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులు… నలుగురిపై కేసు నమోదు ఇద్దరి అరెస్టు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం షాపుల నూతనమద్యం పాలసీ అలాగే బెల్టు షాపులు, కల్తీమద్యం నియంత్రణ కల్తీమద్యం విక్రయాల నియంత్రణ నేపథ్యంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా పొదిలిలోని జిఆర్ వైన్స్ పర్మిట్ రూములో అక్రమంగా విక్రయిస్తున్న కల్తీమద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి షాపును సీజ్ చేశారు.

వివరాల్లోకి వెళితే స్ధానిక విశ్వనాథపురం ఆర్టీసీ బస్టాండ్ మధ్య గేటు ఎదురుగా ఉన్న జిఆర్ వైన్స్ పర్మిట్ రూమ్ నందు కల్తీ మద్యం ఆమ్మకాలు జరుపుతున్నరనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారంనాడు ఉదయం దాడిచేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న సంబంధిత 43 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని జిఆర్ వైన్స్ నౌకర్ యజమానిని పిలిపించి షాప్ తీయించి తనిఖీలు చేయగా అందులో 1.5లీటర్ బాటిల్ నందు నింపిన కల్తీ మద్యాన్ని గుర్తించి రెండు వేరు వేరు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

అందులో యస్డీ అబ్బుల్ జబ్బార్, షేక్ షహిద్ లను అరెస్టు చేశామని షాప్ యాజమాని వరికూటి అనిల్ షాప్ లీజుదారుడు గొలమారి రమణారెడ్డి పరారీలో ఉన్నాడని వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి ఎన్ఫోర్సెమెంట్ సిఐ తిరుపతియ్యలు స్ధానిక ఎక్సెజ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం తెలిపారు.