లాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూలు బ్యాగులు, ప్రోత్సాహక బహుమతులు, నోటు పుస్తకాలు పంపిణీ…..

పట్టణంలోని స్థానిక నవాబ్ మిట్ట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, నేతపాలెం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల అలాగే తలమళ్ల పంచాయతీలోని ఫిర్దోస్ నగర్ అంగన్వాడీ, ప్రాధమిక పాఠశాలల్లో పంపిణీ విద్యార్ధులకు లాల్ ఫౌండేషన్ ద్వారా స్కూలు బ్యాగులు, ప్రోత్సాహక బహుమతులు, నోటు పుస్తకాలు మరియు పెన్ లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా లాల్ ఫౌండేషన్ సభ్యులు అఖిబ్ అహమ్మద్ మాట్లాడుతూ తమ తాతగారి పేరున ప్రారంభించిన లాల్ ఫౌండేషన్ ద్వారా ప్రభుత్వ పాటశాలల్లోని విద్యార్థులు సౌకర్యంగా అలాగే పోటీతత్వంతో చదువులలో రాణించాలనే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం పాఠశాలల్లోని విద్యార్థులకు స్కూలు బ్యాగులు, ప్రోత్సాహక నగదు బహుమతి మరియు నోటు పుస్తకాలు, పెన్ లను పంపిణీ చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో భాగంగా నవాబ్ మిట్ట ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల, నేతపాలెం ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల అలాగే తలమళ్ల పంచాయతీలోని ఫిర్దోస్ నగర్ అంగన్వాడీ, ప్రాధమిక పాఠశాలల్లో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లాల్ ఫౌండేషన్ చైర్మన్ ఎంఎ ఖయ్యుం, పాఠశాలల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.